Tuesday, September 10, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: 20 ఏళ్ల తర్వాత అపూర్వం -ఆ'పూర్వ' విద్యార్థుల కలయిక

Gonegandla: 20 ఏళ్ల తర్వాత అపూర్వం -ఆ’పూర్వ’ విద్యార్థుల కలయిక

మండల కేంద్రమైన గోనెగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 ఏళ్ల కిందట కలిసి చదివుకొన్నారు. అనంతరం ఉన్నత చదువుల కోసం ఎవరికి వారు విడిపోయారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఉద్యోగాలు, సంసార జీవన ప్రయనంలో 20 ఏళ్లు గడిచిపోయాయి. తిరిగి నాటి స్నేహితులతో కలవగానే ఒకరికోకరు పిల్లలుగా మారిపోయి కుశల ప్రశ్నలతో ఆనందాలు, ఆశ్చర్యాలు, ఆత్మీయ పలకరింపులతో సందడి చేశారు. పాఠశాలలో వారు స్నేహితులతో కలసి చేసిన చిలిపి చేష్టలు, కుశల సమాచారాలను పంచుకొని సాయంత్రం భారమైన హృదయాలతో మరోమారు వీడ్కోలు తెలుపుకున్నారు.

- Advertisement -

ఈ పూర్వ విద్యార్థుల ఆ “పూర్వ కలయిక”కు గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికైంది. ఈ పాఠశాలలో 2003-04 లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఒక వేదికపై అందరూ కలిశారు. ముందుగా వీరితోపాటు చదువుకొని మృతులైన స్నేహితుల చిత్రపటాలకు పూర్వ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ మహోన్నత కార్యక్రమానికి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కొందరు నెలల పాటు కష్టపడ్డారు. అందరి అడ్రస్, ఫోన్ నెంబర్లు సేకరించుకొని ఆహ్వానాలు పలికారు. విద్యా బుద్దులు నేర్చిన నాటి గురువులు ప్రధానోపాధ్యాయులు వెంకట్రామణ, ఉపాధ్యాయులు విజయకుమారి,శివ జ్యోతి, కృష్ణయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, బేగం, ఈశ్వర్ రెడ్డి, రాఘవరెడ్డి, నారాయణ, అన్వర్, హుస్సేన్ పీరా, మహబూబ్ బాషా, అబ్దుల్ ఖాదర్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ నాడు పాఠశాలలో గడిపిన జ్ఞాపకాలను కొన్నింటిని నెమరు వేసుకుంటూ సందడిగా ఆటపాటలతో ఉల్లాసంగా నవ్వుతూ నవ్విస్తూ గడిపారు.తమను గుర్తుపెట్టుకుని ప్రత్యేక ఆహ్వానాలతో ఆహ్వానించిన మా శిష్యుల సమ్మేళనం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని, అయితే మేము చదువు చెప్పిన విద్యార్థులందరూ విలువలతో కూడిన జీవితాలను గడపాలని, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులను, అత్తమామలను కుటుంబ సభ్యులందరినీ మంచి ఆలోచనతో చూసుకోవాలని సూచించారు. ఆనాటి ఉపాధ్యాయులందరం ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో చాలామంది ఉపాధ్యాయులతో కలిసి విధులు నిర్వహిస్తూ ఉన్న మమ్మల్ని 2003- 04 లో చదివిన విద్యార్థులు గురువులను ఆహ్వానించి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలన్న ఆలోచన మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పూర్వ విద్యార్థులను కొనియాడారు. అనంతరం పూర్వ విద్యార్థులు చదువు నేర్పిన గురువులకు కృతజ్ఞతాభివందనంతో పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉదయం సాయంత్రం ట్యూషన్ చెప్పిన టీచర్లను పూలమాల, శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా 2003-04 పదవ తరగతి చదివిన మిమిక్రీ ఓంకార్ తమ స్నేహితుల ముందు సినిమా హీరోల మరియు రాజకీయ నాయకుల గొంతులను ధ్వన్యనురణతో, ఆర్కెస్ట్రా పాటలతో అలరించి నాడు చదువు చెప్పిన గురువుల గొంతులను అనుకరించి, అటు గురువులను, ఇటు తోటి స్నేహితులను కడుపుబ్బ నవ్వించారు. ఈ సందర్భంగా మిమిక్రీ ఓంకార్ను ఉపాధ్యాయులు, తోటి మిత్రులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ట్యూషన్ చెప్పిన గురువులు రమేష్, నారాయణరావు, హనీఫ్,శివశంకర్, హజీ, బాలరాజు, పూర్వ విద్యార్థులు భరత్ కుమార్, కిరణ్ కుమార్, రంగస్వామి, ఫరూక్, మిమిక్రీ ఓంకార్,అనిల్ కుమార్, రాంబాబు,గాయత్రి ,రజని, అపర్ణ, బి.వరలక్ష్మి, సలీమా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News