ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు హక్కు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని మండల తహసిల్దార్ పార్వతి, మండల అభివృద్ధి అధికారి సోనీ భాయ్ లు పేర్కొన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్ల లో స్వీప్ ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటు యొక్క ప్రాముఖ్యతను గోనెగండ్ల మండల ప్రజలందరికీ తెలియచేయడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అని అని, ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని, ఓటు హక్కును పూర్తిస్థాయిలో వినియోగించుకునే సమయంలో ఏవైనా ఆటంకాలు ఎదురవొచ్చు బయట నుంచి వచ్చే ప్రలోభాలు కావచ్చు అటువంటి భయాలు ఏవి లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వాతావరణం కల్పించడం మా బాధ్యత అని అన్నారు.
ఇప్పటివరకు మీ ఓటు హక్కు ఉన్నదో లేదో చూసుకోవాలని, ఒకవేళ లేదంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు నమోదు చేయించుకొనుటకు సమయం ఉన్నందున నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి-2 నీలకంఠ ,ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.