DWCRA women: ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళా సంఘాలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు.. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై విధించే పలు రకాల సర్వీస్ ఛార్జీలను (Service Charges) రద్దు చేస్తున్నట్లు ఏపీ గ్రామీణ బ్యాంకు (APGB) అధికారికంగా ప్రకటించింది.
30 లక్షల మంది మహిళలకు లబ్ధి: ఈ నిర్ణయం ద్వారా ఏపీ గ్రామీణ బ్యాంకు పరిధిలోని సుమారు 30 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏటా రూ.500 కోట్ల మేర భారీ ఆర్థిక లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మినహాయింపు గతేడాది జూలై 1 నుంచి తీసుకున్న రుణాలన్నింటికీ వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది. సేవా ఛార్జీల భారం తొలగిపోవడంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHG) ఆర్థికంగా మరింత ఊరట లభించనుంది.
Also Read-kidnapping case: కిడ్నాప్ కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్టు

