Gas consumers: ఏపీలోని గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్‌లో సిలిండర్ బుక్ చేసిన రెండు లేదా మూడు రోజుల్లోనే డెలివరీ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
సరిపడా నిల్వలు సిద్ధం: రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని రిఫైనరీలలో ప్రస్తుతం 14,000 టన్నుల ఎల్‌పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొంది. ఇరాన్ నుండి చమురు దిగుమతులు యధావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం మనపై అంతగా లేదని వెల్లడించారు.
Also read-Amaravathi: అమరావతికి రాజముద్ర.. 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని హోదా
పౌరసరఫరాల శాఖ విజ్ఞప్తి: గ్యాస్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ ప్రజలను కోరింది. కొంతమంది కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అధికారులు అన్నారు. గ్యాస్ కొరత ఉందన్న భయంతో హడావిడిగా బుకింగ్స్ చేయవద్దని తెలిపారు. ప్రతి వినియోగదారునికి సకాలంలో సిలిండర్ చేరేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.

