ఏపీలో ఆస్తి పన్ను(Property Tax) బకాయిదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్తి పన్నుపై వడ్డీ బకాయిల్లో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. భవనాలు, ఖాళీ స్థలాలపై ప్రస్తుత సంవత్సరం చెల్లించాల్సిన పన్నులతో పాటు పాత బకాయిలపై వడ్డీని 50శాతం మేర మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే ఈ రాయితీ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓవైపు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు.. మరోవైపు పేరుకు పోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Property Tax: ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త
సంబంధిత వార్తలు | RELATED ARTICLES