Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Tenth Students: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఏంటంటే..?

Tenth Students: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ఏంటంటే..?

పదో తరగతి విద్యార్థులకు కూటమి ప్రభత్వం శుభవార్త అందించింది. ప్రధాన పరీక్షలను తెలుగులో కూడా రాసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసేటప్పుడు ఇంగ్లీష్‌/తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు ఆప్షన్స్‌ను కూడా మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఒక్క ఏడాదికే మాత్రం ఇది వర్తించనుందని పేర్కొంది.

- Advertisement -

కాగా 2020-21 ఏడాదిలో 1 నుంచి 6వ తరగతులను ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చిన వైసీపీ ప్రభుత్వం.. ఆ విద్యార్థులు పదో తరగతికి వచ్చాక ఇంగ్లీష్‌లోనే పరీక్షలు రాయాలని రూల్ పెట్టింది. అయితే సుప్రీంకోర్టులో దీనిపై కేసు దాఖలు కావడంతో ‘ఇంగ్లీష్ మీడియం’ అని చెప్పకుండా ‘ఒకే మీడియం’ ఉండాలని ఆదేశించింది.

కానీ అది ఏ మీడియం అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా పాఠశాల్లలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండింటినీ కొనసాగించారు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియం విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలంటూ ఉపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి తెలుగులో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News