రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బార్ల(Bars) లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించింది. 3 స్టార్, అంతకంటే హోటళ్లలో ఫీజులు, రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ. 25 లక్షలకు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో టూరిజం, ఆతిథ్య రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఛార్జీలు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
బార్ల లైసెన్స్ ఫీజును సంవత్సరానికి రూ.5 లక్షల మేర నిర్ధరిస్తూ పేర్కొంది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ. 20 లక్షలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులు తగ్గించాలని హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్టాల్ హోటల్స్ ఉన్న ప్రదేశంలో బార్ లైసెన్సుల జారీపై నియంత్రణణు ఎత్తివేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.