ఏపీలో కొత్త పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో బడ్జెట్(AP Budget 2025) ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకే రూ.25లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దీని వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుఎండా కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్‌లో రూ.19,264 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
AP Budget 2025: ఏపీలో కొత్త పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES