చేనేతపై విధించిన 5శాతం జిఎస్టీ రద్దు చేసి, జీరో జిఎస్టిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఎమ్మిగనూరు చేనేత కార్మికులు. చేనేత సహకార సొసైటీ ప్రధాన కార్యాలయం ముందు ఈమేరకు నిరసన చేపట్టారు. ‘జీరో జిఎస్టి ఉద్యమం’ ప్రారంభమై ఏడాది అయిన సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షులు ఎర్ర మాధవ వెంకన్న పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం ఈ కార్యక్రమంలో పాల్గొంది. పిఎస్ఇ ఛైర్మన్ బండ నాగరాజు, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం కార్యదర్శి చేనేత ఉద్యమకర్త ఎంఆర్ శ్రీనివాసులు, డాక్టర్ గణేష్, శివదాస్ అధ్వర్యంలో ప్లక్కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. భారతదేశంలో మొదటి స్థానం వ్యవసాయ రంగం అయితే రెండవ స్థానం చేనేత రంగానిదని స్వాతంత్రం రాకముందు నుండి చేనేత రంగం స్వాతంత్ర పోరాటంలో ఒక భాగమని వీరు గుర్తుచేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఏ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేనేతపై జిఎస్టి విధించలేదని వీరు గుర్తుచేశారు. అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగ అధ్యక్షులు ఎర్ర మాధ వెంకన్న అధ్వర్యంలో 15 రాష్ట్రాలు 21 రాజకీయ పార్టీలను కలిసి సుమారు 100 మంది పార్లమెంటు సభ్యులను కలిసి జీరో జిఎస్టిపై సంతకాలు సేకరించారు. బెంగళూరులో చేనేత సంఘాల ప్రతినిధులతో కలిసి 26,000 మందితో త్వరలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.
GST: చేనేతపై 5% GST రద్దు చేసి..జీరోGSTని అమలు చేయాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES