Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gudivada: టిడ్కో ఇళ్ల పంపిణీ చేసిన సీఎం జగన్

Gudivada: టిడ్కో ఇళ్ల పంపిణీ చేసిన సీఎం జగన్

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయపాలెంలో లబ్ధిదారులకు సీఎం వైయస్ జగన్ టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అప్పగించారు. గుడివాడలో గృహ నిర్మాణ యజ్ఞం విజయవంతంగా సాగింది. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయపాలెంలో 77 ఎకరాల ఒకే లేఅవుట్ లో పూర్తయిన 8, 912 టిడ్కో ఇళ్లు… అక్కడే మరో 178.63 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు.. కడుతున్న 4,500 ఇళ్లు.

- Advertisement -

టిడ్కో లబ్ధిదారులకు అండగా..
రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు. రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో అందజేత.. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ. 9,406 కోట్ల మేర లబ్ధి… గత ప్రభుత్వంలో ఇదే ఇంటికి 20 ఏళ్లపాటు నెలకు రూ.3,000 చొప్పున అసలు, వడ్డీలతో కలిపి ఒక్కొక్కరు రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి…
మన ప్రభుత్వం 300 చ॥అ॥ల ఈ టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే ఇస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులపై తగ్గనున్న భారం అక్షరాల రూ. 10,339 కోట్లు..

365 చ॥అ 430 చ॥అ ఇళ్ళకు ముందస్తు వాటాలో 50% రాయితీ
365 చ॥అ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు 44, 304 మందికి ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున, 74,312 మంది 430 చ॥అ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు రూ. 50 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వారు ముందస్తు వాటాగా చెల్లించాల్సిన రూ. 482 కోట్ల భారాన్ని జగనన్న ప్రభుత్వమే భరిస్తూ, మరో రూ.4,626 కోట్లను సబ్సిడీగా అందిస్తున్న ప్రభుత్వం.

ఉచిత రిజిస్ట్రేవున్లు, మౌళిక వసతులకు పెద్దపీట
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ళు ప్రతిపాదించిన ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం, రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజ్ లాంటి మౌలిక వసతులను సైతం నిర్లక్ష్యం చేస్తే.. అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను కట్టించి మరీ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. టిడ్కో ఇళ్ళకు రిజిస్ట్రేషన్లు కూడా ఉచితం. తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి ఉచిత రిజిస్ట్రేషన్ రూపేణా “మరో రూ. 60 వేల లబ్ధి.

రూ.16,601 కోట్ల లబ్ధి

రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ. 11,672 కోట్లు. ముందస్తు వాటా చెల్లింపులో 50 శాతం రాయితీగా రూ. 482 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1200 కోట్లు. మౌలిక వసతులకు మరో రూ. 3,247 కోట్లు కలిపి మొత్తంగా రూ. 16,601 కోట్ల మేర లబ్ధి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 30.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ 21 లక్షల నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం.

గుడివాడలో టిడ్కో ఇళ్లు

మొత్తం టిడ్కో ఇళ్లు : 8,912, గృహ నిర్మాణం, మౌలిక వసతులు, స్థల సేకరణకు చేసిన మొత్తం వ్యయం రూ. 799.19 కోట్లు కేవలం గుడివాడ నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై చేసిన వ్యయం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల విలువ కలిపి మొత్తం రూ. 1,782కోట్లు…

అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్టేషన్లు… తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు అక్కడ ఉన్న ఇంటి స్థలం విలువను బట్టి కనీసం రూ. 5 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు లబ్ధి… రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం అంటే రూ. 2 లక్షల కోట్ల నుండి రూ.3 లక్షల కోట్ల సంపద..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News