Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Guduru: అట్టహాసంగా కబడ్డీ పోటీలు

Guduru: అట్టహాసంగా కబడ్డీ పోటీలు

గూడూరు పట్టణంలో శ్రీ తిమ్మగురుడు స్వామి జాతరను పురస్కరించుకొని అంతరాష్ట్ర కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలకు నియోజవర్గ టిడిపి మాజీ ఇచార్జి డి. విశ్వవర్ధన్ రెడ్డి హాజర్ కాగా పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కొరకు తాను నిరంతరం కృషి చేస్తున్నానని అభివృద్ధి నిరోధకులే నాపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

టిడిపి పాలనలో శాశ్వత తాగునీటి పరిస్కారానికి తీసుకువచ్చిన అమృత్ పథకం పనులు ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం కొంతమంది వైసీపీ నేతలు తమ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి వాపోయారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేమట సురేష్, శేషావలి, బుడ్డంగిల్, టిడిపి నేతలు రేమట వెంకటేష్, కే నాగలాపురం జె సురేష్,చాందుభాష,సి బెలగల్ మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, పౌలు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News