Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Guduru: శ్రీ నాగలింగేశ్వర రథోత్సవం రమణీయం

Guduru: శ్రీ నాగలింగేశ్వర రథోత్సవం రమణీయం

శివరాత్రి సందర్భంగా..

చనుగొండ్ల శ్రీ నాగ లింగేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం రమణీయంగా గ్రామస్తులు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శివ కేశవుల ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. భక్తులు స్వామి వారికి హారతులు, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డోలు, సన్నాయి వాయిద్యాల నడుమ వైభవంగా రథోత్సవం ముందుకు సాగింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కే గోవిందరెడ్డి, తిరుమలరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, శ్యాంరావ్, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, టీచర్ నమో వెంకటేశ్వర్లు, ఎంపిటిసి రంగయ్య, రంగనాయకులు డాక్టర్ వెంకటేష్, సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News