గూడూరు పరిధిలోని శ్రీ గుండు రంగయ్య (గుంటిరంగయ్య) స్వామి ఆలయం పరిసరాల్లో శ్రీకృష్ణ దేవరాయుల శిలాశాసనం లభ్యమైనట్లు స్తానిక ప్రజలు తెలుపారు. స్థానికుల సమాచారం మేరకు BJP మండల అధ్యక్షుడు మల్లేష్ నాయుడు అక్కడికి చేరుకొని శిలా శాసనం దూలాన్ని వెలికి తీశారు. ఈ సందర్భంగా మల్లేష్ నాయుడు మాట్లాడుతూ మారబండ మాదస్వామి అను పిలువబడే దేవాలయానికి కొన్ని వందల ఎకరాల భూమిని శ్రీకృష్ణదేవరాయల కాలంలో బహుమతిగా ఇచ్చినట్లు శిలాశాసనంలో పేర్కొన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ భూములని కబ్జాకి గురై నేడు దేవాలయ ధూప దీప నైవేద్యాలు కార్యక్రమాలకు నోచుకోవడం లేదని స్థానికులు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికైనా కబ్జాలకు గురైన భూములను ఆలయాలకు అప్పజెప్పేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గుంటి రంగస్వామి ఆలయ పూజారి హరికృష్ణ, BJP నాయకులు తదితరులు ఉన్నారు.
Guduru: శ్రీకృష్ణ దేవరాయల శిలాశాసనం లభ్యం
మారబండ మాదస్వామి అని పిలువబడే దేవాలయానికి కొన్ని వందల ఎకరాల భూమిని శ్రీకృష్ణదేవరాయల కాలంలో బహుమతిగా ఇచ్చారు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES