AP CII Summit: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సు ఉత్తరాంధ్ర జిల్లాలకు గొప్ప గుర్తింపు తీసుకురానుందని గిరిజనుల సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 3 వేల మంది పెట్టుబడిదారులు, రాజకీయనేతలు, విదేశీ నిపుణులు పాల్గొంటారు. ఈ సమ్మిట్ ద్వారా ఉత్తరాంధ్ర పర్యాటకం, పరిశ్రమలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
ALSO READ: Gang Rape: నీళ్ల కోసం వెళ్లిన 15 ఏళ్ల బాలికను స్కూల్ కాంపౌండ్‌లోనికి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
ఒకప్పుడు గిరిజన గ్రామాల్లో డోలీలే కనిపించేవని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాంతాలు పర్యాటక అనుభూతి అందించేలా మారాయని మంత్రి గుర్తు చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో రోడ్లు, ఇన్‌ఫ్రా మెరుగుపడటంతో పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. సదస్సుకు వచ్చేవారికి ఉత్తరాంధ్ర పర్యాటక అనుభవం కల్పిస్తామని, ఇది రాష్ట్ర ఇమేజ్‌ను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఇప్పటికే 96 గిరిజన గ్రామాలకు రోడ్ల కోసం రూ.28 కోట్లు మంజూరు చేశామని, అరకు, పాడేరు పరిధి గ్రామాల్లో మరిన్ని రోడ్ల ప్రతిపాదనలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
సీఐఐ సదస్సు విశాఖపట్నంలో జరగడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో టెక్స్‌టైల్స్, టూరిజం, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో MoUలు తన సత్తా చాటనున్నారు. మంత్రి సంధ్యారాణి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గతంలో గిరిజన గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, నీరు వంటి సదుపాయాలు లేకపోవడంతో వెనుకబడి ఉండేవని, ఇప్పుడు పర్యాటక హబ్‌లుగా మారుతున్నాయని చెప్పారు. అరకు వ్యాలీ, బోర్రా కేవ్స్, తిరుమల గిరిజన ప్రాంతాలు పెట్టుబడిదారుల ఆకర్షణకు కారణమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సదస్సు ద్వారా ఉత్తరాంధ్రలో 50 వేల మందికి ఉద్యోగాలు, రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇందులో భాగంగా మంత్రి సంధ్యారాణి గిరిజనుల సంక్షేమానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. గిరిజన యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌లు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, సీఐఐ సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చి, గిరిజన ప్రాంతాలు మరింత ముందుకు సాగతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ఉత్తరాంధ్రకు మైలురాయిగా మారనున్నట్లు కనిపిస్తోంది.


