సామాన్యులకు రైతులకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అధికారం కట్టబెట్టిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు, ఆలూరు పట్టణంలోని ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా గుమ్మనూరు నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుమ్మనూరు జయరాం, ఆయన సోదరులు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, ఆలూరు వైసీపీ ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పాల్గొన్నారు. మంత్రి చేతుల మీదుగా గుమ్మనూరు నారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు, ఈ కార్యక్రమానికి తాలూకాలోని అన్ని మండలాల నుండి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం ప్రజలను నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని మాటిచ్చానని ఇచ్చిన మాట ప్రకారం తాలూకాలోని సామాన్య కార్యకర్తలకు రాజ్యాధికాలని కట్టుబెట్టామని తెలిపారు. అలాగే రాబోవు దినాల్లో కూడా పార్టీకి చేసిన వారిని ఉన్నత స్థానంలో పదవులను కట్టిపెట్టి చూసుకుంటామన్నారు. చిప్పగిరి మండల కన్వీనర్ గా పనిచేసిన నారాయణ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడని ఇకముందు కూడా నియోజకవర్గ ప్రజలకు ఆయన సేవలు ఎంతో అవసరం ఉన్నాయని గుర్తించి ఆలూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందన్నారు, నియోజకవర్గంలోని కార్యకర్తలు కూడా పార్టీకి సేవ చేస్తున్నారని వారి సేవలను కూడా గుర్తించి మున్ముందు తగిన గుర్తింపు లభించే విధంగా కృషి చేస్తామన్నారు. రాబోవు రోజుల్లో నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించి పథకాల వారికి అందుతున్నాయా లేదా అని విచారణ చేసి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలని తెలిపారు, అనంతరం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి పదవులు అయినా సామాన్యులకే అందుతున్నాయని సామాన్యులకు రాజ్యాధికారం కట్టబెట్టిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దక్కుతుందన్నారు, పార్టీకి నేను చేసిన సేవలను గుర్తించి నాకు ఆలూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా నియమించడం సంతోష పడవలసిన విషయమన్నారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులకు, ఆలూరు వైకాపా ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామికి రుణపడి ఉంటాను అన్నారు, నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నియోజకవర్గ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చిన అశేష జనాలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని డైరెక్టర్లు మండలాల జడ్పిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు మండల కన్వీనర్లు సర్పంచులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,
Gummanuru: సామాన్యులకు అధికారం కట్టబెట్టింది జగనే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES