రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకం అందించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పల్లెదొడ్డి, గద్దెరాళ్ల గ్రామంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రి సోదరులు శ్రీనివాసులు, నారాయణ స్వామిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో పర్యటించారు. ముందుగా పల్లెదొడ్డి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం గ్రామాలలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయం ద్వారా నేరుగా అర్హులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కొనియాడారు. పత్తికొండ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, స్థానిక యస్ఐ భూపాలుడు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ చేపట్టిన ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటేష్ నాయక్, ఏ.ఓ సురేష్ బాబు, ఎం.ఈ.ఓ తిమ్మారెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్.ఏ.ఈ మురళి మోహన్, ఈ.ఓ పి.ఆర్డీ సూర్యనారాయణ, ఇంచార్జి ఎంపీడీఓ ఇదృష్ బాషా, ఎపిఓ కృష్ణమూర్తి, ఏ.పి.ఎం రమేష్ బాబు, జడ్పీటిసి సభ్యులు కిట్టు, కన్వీనర్ మల్లికార్జున, లుముంబ, ఉద్దె చంద్రన్న, ప్రేమనాథ్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, వెలమకూరు రామచంద్ర, పాలకుర్తి ప్రతాప్, తెర్నెకల్ సర్పంచ్ అరుణ్ కుమార్, టోపి యూసుఫ్, పొట్లపాడు ఆనంద్, కూకటికొండ బద్రి
పాల్గొన్నారు.
Gummanuru Jayaram: ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తా
గడపగడపకు మనప్రభుత్వంలో మంత్రి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES