బీసీలకు పెద్ద పీట వేసారనే లోకేష్ కు మంత్రి గుమ్మనూరు జయరాం పలు ప్రశ్నలు సంధించారు. 14 ఏళ్ల పాలనలో బీసీలకు గుర్తించకుండా విస్మరించిన ఆయన ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిన విమర్శించడం పనిగా పెట్టుకున్నారని గుమ్మనూరి విమర్శించారు. రాష్ట్రంలో కురువ, యాదవ్, ఇలా అన్ని కులాలకు సముచిత స్థానం జగన్ సర్కారు కల్పించిందన్నారు. చివరి రక్తం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే తామంతా ఉంటామన్నారు.
దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను బీసీల రాష్ట్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని మంత్రి ఈసందర్భంగా వెల్లడించారు. 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించి, ఇచ్చిన హామీలను తమ సర్కారు నేర్చుతోందన్నారు. శాసనమండలిలో 25 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానాన్ని జగన్ కల్పించారు. పాదయాత్ర అంటే కేవలం వైఎస్ కుటుంబానికి దక్కుతుందని గుర్తు చేశారు.
Gummanuru Jayaram: లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఫైర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES