‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం హొళగుంద మండలం ఎళ్ళార్తి సచివాలయం పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు తాలూకా ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎళ్ళార్తి దర్గాలో షేక్షావలి షాషావలి తాతలు దర్శనం చేసుకుని అనంతరం సచివాలయం పరిధిలోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజ్, తాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని కోరారు. సిసి రోడ్డు డ్రైనేజ్ కోసం సచివాలయానికి వచ్చిన 20 లక్షలు కేటాయించాలని మంత్రి తెలిపారు. తాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడానికి 40 లక్షలు మంజూరు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఇంటివద్ద ప్రజలు ఆనందంతో స్వాగతం చెబుతున్నారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని గ్రామస్తులు భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ కొగిలతోట శేషప్ప, మండల కన్వీనర్ షఫీ ఉల్లా, వైసీపీ సీనియర్ నాయకుడు దర్గప్ప, ఈరన్న, వైసిపి యువ నాయకులు ఎస్.కె గిరి, నూరి భాష, వైసీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున, లక్ష్మీకాంత, ఎంపీపీ తనయుడు ఈసా, సర్పంచులు, ఎంపీటీసీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, హొళగుంద ఎస్సై శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.