అంకితభావంతో పని చేసి ప్రజల మన్ననలను పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవనకొండ మండలం నేల్లిబండ, బండగట్టు గ్రామంలో నిర్వహించారు. ఆయన మొదట గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి ప్రజలకు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు గూర్చి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఏదైనా సమస్యతో సచివాలయానికి వస్తే వారిని చిరునవ్వుతో పలకరించి వారి సమస్యను పూర్తిగా విని పరిష్కరించాలి అన్నారు. ఒకవేళ ఆ సమస్య మన పరిధిలో లేకపోతే వారికి ఓపికతో సమాధానం చెప్పాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారాలపై నిర్లక్ష్యం చూపొద్దని సచివాల సిబ్బందికి సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకు సేవకులమన్నారు. సచివాలయం వెలుపల ఏర్పాటుచేసిన వైయస్సార్ యంత్ర సేవ పథకం ద్వారా లబ్ధిదారులకు కురువ నారాయణ, ఆధిలక్ష్మీ వ్యవసాయ వాహనాలను రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు.రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పిస్తున్నామన్నారు. రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా, వ్యవసాయానికి వ్యవసాయ పనిముట్లు, వాహనాలు ట్రాక్టర్, వరి కోత మిషన్, మరియు ఏదైనా అనుకోని సంఘటనలు ద్వార పంట నష్టం జరిగితే ఆ పంట నష్ట కోసం పంటల బీమా, వైయస్సార్ జలకళ ఇలా అనేక విధాలుగా రైతులకు పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు.జగనన్న సురక్ష పథకం అమలులో బాగంగా ప్రతి అధికారి, వాలంటీర్ ప్రతి ఇంటిని దర్శించి ఆ ఇంటిలో సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వారి యొక్క సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కారానికై కృషి చేయాలని సచివాలయం సిబ్బంది అధికారులకు మంత్రి సూచించారు. గ్రామంలో ఇంటింటిని దర్శించి ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరిస్తూ వారి యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ ఎలా ఉంది, సరిగ్గా పని చేస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు కు అర్హత ఉండి, వారికి పథకాలు అందలేదు అన్నమాట రాకూడదని సచివాల సిబ్బందికి సూచించారు. నెల్లిబండ పంచాయతీలో గ్రామాలకు సంక్షేమ పథకాలు ద్వారా దాదాపు రూ. 2.30 కోట్లు పై చిలుకు లబ్ది చేకూరింది అన్నారు. గ్రామంలో మంత్రి పర్యటిస్తుండగా కొందరు త్రాగునీటి సమస్య మంత్రివర్గ దృష్టికి తీసుకొని రాగా సానుకూలంగా స్పందించి త్రాగునీటి ఏద్దడి పరిష్కారానికై నెల్లిబండ గ్రామానికి రూ 14.00 లక్షల మరియు బండగట్టు గ్రామానికి రూ 6.0 లక్షలు మంజూరు చేశారు. వెంటనే ప్రణాళికలు సిద్ధం చేసి ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీడీవో గౌరీ దేవి, తహశీల్దార్ వెంకటేష్ నాయక్, జడ్పిటిసి రామకృష్ణ, సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.