Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gummanuru Jayaram: ప్రజా సంక్షేమమే వైసిపి ప్రభుత్వం ధ్యేయం

Gummanuru Jayaram: ప్రజా సంక్షేమమే వైసిపి ప్రభుత్వం ధ్యేయం

భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిన మంత్రి

ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. మండలంలోని తెర్నేకల్ గ్రామంలో గడపగడపకు మన వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైసిపి కార్యదర్శి, శ్రీశైలం నియోజకవర్గం అబ్జర్వర్ సురేంద్ర రెడ్డి తో కలిసి హాజరయ్యారు. ముందుగా 80 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయం-1,2 భవనాలను ప్రారంభించారు. పొట్లపాడు గ్రామ రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో తెర్నేకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రూ 24 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తెల్ల వంక వాగు డ్రైనేజీ నిర్మాణానికి రూ. 30 లక్షలు, గ్రామంలో త్రాగునీటి సమస్య నివారణకు 15 లక్షలు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి పాలన ముందుకు తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు.

నాడు- నేడు పనుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా తీర్చిదిద్దామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిట పాలన అందించడం జరిగిందని గ్రామ సచివాలయ అధికారులు సేవా భావంతో పనిచేసి ప్రజల సమస్యలను తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో గౌరీదేవి, తాసిల్దార్ వెంకటేష్ నాయక్, వ్యవసాయ అధికారి సురేష్ బాబు, ఎంఈఓ తిమ్మారెడ్డి రాష్ట్ర మంత్రి గుమ్మనూరు సోదరులు నారాయణస్వామి, శ్రీనివాసులు, మండల ఎంపీపీ లక్ష్మీదేవి, ఆమె భర్త లుముంబా, జడ్పిటిసి కిట్టు, వైసీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, పొట్లపాడు సర్పంచ్ సోమశేఖర్ రెడ్డి, ఎంపిటిసి నామాల శ్రీనివాసులు, ఉప సర్పంచ్ భర్త బెల్ ఈరన్న, వైసిపి నాయకులు దివాకర్ నాయుడు, మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హంపి రెడ్డి, నారాయణరెడ్డి, రాఘవేంద్ర, చాప వీరన్న, రామచంద్ర, పులి నరేష్, నాగన్న, ఏసేపు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News