Tuesday, February 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Gummidi Sandhyarani: 1/70 చట్టం మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు.. గిరిజనులకు సంధ్యారాణి హామీ

Gummidi Sandhyarani: 1/70 చట్టం మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు.. గిరిజనులకు సంధ్యారాణి హామీ

మన్యం ప్రాంతాల్లో గిరిజన, ఆదివాసీల సంఘాల పిలుపు మేరకు 48 గంటల బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి(Gummidi Sandhyarani) స్పందించారు. 1/70 చట్టాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనులెవ్వరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు విషప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ పాలనలో గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైసీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు.

- Advertisement -

కాగా గిరిజన, ఆదివాసీల భూములు అన్యాక్రాంతం కాకుండా వారికే చెందేలా భూమి బదాలాయింపు చట్టం1959 తీసుకొచ్చారు. దీనిని 1970లో యాక్ట్ 1/70 చట్టంగా మార్పు చేశారు. ఈ చట్టం మేరకు గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడం నిషిద్ధం. గిరిజనులు, గిరిజనులు సభ్యులుగా ఉండే కోఆపరేటీవ్ సొసైటీకి తప్ప వేరే వారికి స్థిరాస్తిని అమ్మడం, కొనడం, గిఫ్ట్ డీడీ చేయడం వంటి బదాలాయింపులు నిషిద్ధం. అయితే ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పర్యాటక కేంద్రాలను ఫ్రీజోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కోరారు. దీంతో 1/70 చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు బంద్‌కు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News