Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Constable: గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి..!

Constable: గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి..!

Constable| ఇటీవల కాలంలో చిన్న విషయాలకు కూడా ఆత్మహత్య చేసుకోవడం సాధారణం అయిపోయింది. చదువుకునే యువతే కాకుండా.. ఉద్యోగులు కూడా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మహత్యలు కూడా పెరగడం కలవరపెడుతోంది. ఉన్నత అధికారుల వేధింపులో.. టార్గెట్‌లో ఛేదించలేక తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. అనంతరం మానసిక ఒత్తిడి లేక బలవంతంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

- Advertisement -

డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్.. తన కాన్వాయ్‌లో ఉన్న గన్నుతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అయితే తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతోనే కానిస్టేబుల్‌ ‌తలలోకి బుల్లెట్ దూసుకెళ్లి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad