Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Rishiteshwari: రిషితేశ్వరి ఆత్మహత్య కేసు.. కొట్టేసిన గుంటూరు జిల్లా కోర్టు

Rishiteshwari: రిషితేశ్వరి ఆత్మహత్య కేసు.. కొట్టేసిన గుంటూరు జిల్లా కోర్టు

Rishiteshwari| తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. నేరం నిరూపితం కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ర్యాగింగ్‌, వేధింపుల కారణాలతో 2015 జులై 14న నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌ రాసింది. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. దీనిపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

- Advertisement -

అనంతరం గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్లపాటు విచారణ కొనసాగింది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్‌. కోర్టు తీర్పుతో బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్య అని ఆరోపిస్తున్నారు. న్యాయం జరుగుతుందని భావించినా చివరకు కేసును కోర్టు కొట్టివేయడం తమను తీవ్రంగా కలిచివేసిందని వాపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News