పాలకుల నిర్లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీల నిరాదరణతో వెనుకబడిన మరింత నిక్కచ్చిగా చెప్పాలంటే ” వెనక పడవేయబడిన ” రాయలసీమ సమాజం సిద్దేశ్వరం ఉద్యమస్ఫూర్తితో గొంతు సవరించుకుంటూ తన హక్కుల సాధన దిశగా గత ఏడు సంవత్సరాలుగా ముందుకు సాగుతూ నడుస్తుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థ నాయకులు గురుమూర్తి అన్నారు. పట్టణంలో స్థానిక రబ్బాని కంప్లైంట్స్ ఆవరణంలో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 7వ వార్షికోత్సవ సందర్భంగా సిద్దేశ్వరం జల జాదరణ దీక్షను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంఘం, రాయలసీమ విద్యావంతుల ఐక్యవేదిక, కే ఎన్ పి ఎస్, డిటిఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు జల జాగరణ దీక్ష పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం జాతీయ బీసీ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు కురుమూర్తి,రాయలసీమ విద్యావంతుల వేదిక రత్నం లు మాట్లాడుతూ మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమ చరిత్రలో మే 31న 2016 నిర్వహించిన సిద్దేశ్వరం అలుగు సాధన ఉద్యమం చారిత్రాత్మకమైనదన్నారు. ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా 30 వేలకు మందికి పైగా రాయలసీమ ప్రజానికం స్వచ్ఛందంగా, తమ వాహనాలతో, తమ ఆహారం-నీటితో, సిద్దేశ్వరం అలుగు ప్రజాశక్తి స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. అయితే ఆనాడు సిద్దేశ్వరం అలుగు ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని పాలకులు మరియు అనేక శక్తులు శత విధాలుగా ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు. పాలకులు మరియు అనేక శక్తులు శతవిధాలుగా ప్రయత్నం చేసిన రాయలసీమ ప్రజానికం మొక్కవోని దీక్షతో అత్యంత శాంతియుతంగా ఉద్యమాన్ని విజయవంతం చేశారని గుర్తు చేశారు. శాసనసభ సాక్షిగా రాయలసీమ హక్కుల పత్రం శ్రీ భాగ వడంబడికను ప్రభుత్వం గుర్తించిందని అనేక పాలన అనుమతులను సాధించినా, వాటిని అమలు చేయలేని దిశగా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వారి నిరక్షణకు ధోరణిని తప్పుపడుతూ ఇది వారికీ తగదని హెచ్చరించారు. రాయలసీమ సమాజం తమకు ఏమి కావాలో స్పష్టంగా అడిగే దిశగా ఎదగడానికి సిద్దేశ్వర శంకుస్థాపన స్పూర్తితో మరొక అడుగు ముందుకు వేసిన అవసరం ఎంతైనా ఉందని అది రాయలసీమ ప్రజలకు గమనించాలని కోరారు. సిద్దేశ్వరం ఉద్యమస్ఫూర్తితో అనేక ఉద్యమాల కార్యక్రమాల ఫలితంగా సీమ సమాజంలో వెలుగోడు, గోరుకల్లు, పులి కనుమ, అవుకు, గండికోట రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో నీరు నిలపడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తి ఉద్యమ పాత్ర ఎంత ఉందన్నారు. ఉద్యమాల ఫలితంగానే హంద్రీనీవా కింద చెరువులలో నీరు నింపడం, రాయలసీమ ప్రాజెక్టు అయిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా,వెలిగొండ, ప్రాజెక్టుల తో పాటు ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర మరియు సిద్దాపురం ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలా రూపొందించడంలో విజయం సాధించినామన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, హంద్రీనీవా కాలువ సామర్థ్యం పెంపు తదితర అంశాలపై పాలనపరమైన అనుమతులు సాధించుకున్నామని ప్రజలు గమనించాలని కోరారు. సిద్దేశ్వరం అలుగుతో పాటు సీమ సాగునీటి స్థిరీకరణ ప్రాజెక్టులు, చట్టబద్ధమైన సాగునీటి హక్కులు, కృష్ణన్నది యాజమాన్య బోర్డ్ కార్యాలయం కర్నూలు ఏర్పాటు మరియు పరిపాలన, అభివృద్ధి కేంద్రీకరణలో సమాన అవకాశాలతో రాయలసీమ సమాజ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్రాలపై ఉద్యమించడం జరుగుతుందని వారు హెచ్చరించారు. సిద్దేశ్వరం జల జాగరణ దీక్షకు రాయలసీమ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వేలాదిగా పాల్గొని ఏడవ వార్షికోత్సవమును విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కే ఎన్ పి ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బరాయుడు, డిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు , మండల నాయకులు నాగస్వాములు, బీసీ సంక్షేమ సంఘం పాములపాడు నాయకులు సుభాష్ యాదవ్, స్వామి దాస్, జాన్సన్ మరియు రాయలసీమ సాగునీటి సాధనసమితి నాయకులు పాల్గొన్నారు.
Gurumurthy: పాలకుల నిర్లక్ష్యం వల్లే రాయలసీమ ప్రజలకు కష్టాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES