Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gururaj Desai: బాబు ఆరోగ్యంపై తెలుగు తమ్ముళ్ల ఆందోళన

Gururaj Desai: బాబు ఆరోగ్యంపై తెలుగు తమ్ముళ్ల ఆందోళన

ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్

చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నందవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురురాజ్ దేశాయ్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వారి ప్రభుత్వ హయాంలో తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని అలాంటి వ్యక్తిని ఈరోజు వైసిపి ప్రభుత్వం వారి పార్టీ మనవడు కోసం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనాధారిత ఆరోపణలు చేసి ఈరోజు ఒక ముద్దాయిగా జైలు జీవితాన్ని అనుభవింప చేస్తున్నారని మండిపడ్డారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తన వైఖరిని మార్చుకొని చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిన సేవలను, ఆయన వయస్సును, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి జైల్లో అన్ని రకాల సదుపాయాలు సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను గమనించి కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తుందని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చొరవ కల్పించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యపరిస్థితి దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడుకి జైల్లో అన్ని వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇంచార్జ్ కాసిం వలి, మండల కన్వీనర్ దేవల్ల చిన్న రాముడు, టిడిపి నాయకులు డబ్బా ఈరన్న, మిట్టాసోమపురం వీరేశ్, రామన్న గౌడ్, తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News