ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి (GV Reddy) రాజీనామా చేశారు. అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. న్యాయవాద వృత్తిలో కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా ఇటీవల ఏపీ ఫైబర్ నెట్(AP FiberNet) అభివృద్ధికి సహకరించలేదంటూ ముగ్గురు ఉన్నతాధికారులపై సస్పెండ్ వేటు పడిన సంగతి తెలిసిందే. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పూ భరద్వాజ, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేశ్, ప్రొక్యూర్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్‌ను తొలగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఇక ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్‌కుమార్ నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి కూటమి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన జీవీ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
