కర్నూలు నగర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పరిశీలించారు. కర్నూలు స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. కర్నూలు స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, మేయర్ బి.వై రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూల్ నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
