Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Headmaster Viral Video: తప్ప తాగి పై అధికారి ముందే చిందులేసిన హెడ్‌ మాస్టర్‌.. వైరల్‌...

Headmaster Viral Video: తప్ప తాగి పై అధికారి ముందే చిందులేసిన హెడ్‌ మాస్టర్‌.. వైరల్‌ వీడియో

Headmaster Drunk Viral Video: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి రేపటి సమాజాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన కొందరు గురువులు తప్పటడుగులు వేస్తున్నారు. విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, మంచి చెడూ చెప్పకుండా వారిపై పైశాచికంగా దాడి చేయడం, తరగతి గదిలో నిద్రపోవడం, మద్యం తాగి పాఠశాలకు రావడం ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ పాఠశాలలో బాధ్యత గల పదవిలో ఉన్న హెడ్‌ మాస్టర్‌ మద్యం తాగి.. తన పై అధికారిపై చిందులేసిన ఘటన చోటుచేసుకుంది. నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్‌లో గత కొంతకాలంగా హెడ్‌మాస్టర్‌ మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడని ఫిర్యాదులు అందాయి. దీంతో డిప్యూటీ డీఈఓ విచారణ కోసం పాఠశాలకు వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న హెడ్‌ మాస్టర్‌ డిప్యూటీ డీఈఓ ముందే అసభ్యపదజాలంతో రెచ్చిపోయాడు. హెడ్‌ మాస్టర్‌ తీరుతో డిప్యూటీ డీఈఓ ఖంగు తిన్నారు.

 Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-parakamani-scam-andhra-pradesh-high-court-orders-cid-probe/

అక్కడున్న ఉపాధ్యాయ సిబ్బంది ఈ తతంగాన్ని అంతా తమ సెల్‌ఫోన్‌లలో రికార్డు చేశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. పై అధికారి ముందే ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు అతడిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad