రేపు 81 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 211 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం కాకినాడ జిల్లా చామవరంలో 44.2°C, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 43.8°C, తిరుపతి జిల్లా సత్యవేడులో 43.7°C, కృష్ణా జిల్లా గన్నవరం,ఏన్టీఆర్ జిల్లా చిలకల్లులో 43.5°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. 8 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 77 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.
Heat wave: రేపు 81 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
అక్కడక్కడ ఈదురg గాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES