Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave alert: రేపు 60 మండలాల్లో వడగాలులు

Heat wave alert: రేపు 60 మండలాల్లో వడగాలులు

రేపు అనకాపల్లి జిల్లా గొలుగొండ, నర్సీపట్నం, నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రేపు 60 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(60) :-
అల్లూరి జిల్లా 1,
అనకాపల్లి 15,
గుంటూరు 8,
కాకినాడ 14,
కోనసీమ 3,
కృష్ణా 1,
ఎన్టీఆర్ 3,
పల్నాడు 1,
మన్యం 1,
విశాఖ 3,
విజయనగరం 8,
వైస్సార్ జిల్లాలో 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

గురువారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలో వడగాల్పులు వీచాయి.

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News