రాష్ట్రంలో శుక్రవారం ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు అల్లూరి జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు, 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (145):
విజయనగరం 3, పార్వతీపురంమన్యం 3, అల్లూరి 3, ఏలూరు 2, కృష్ణా 4, ఎన్టీఆర్ 13, గుంటూరు 17,
బాపట్ల14, పల్నాడు 28, ప్రకాశం 27, నెల్లూరు 18, నంద్యాల 1, అనంతపురం 5, సత్యసాయి2, వైయస్ఆర్ 4, అన్నమయ్య ఒక
మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో
గురువారం ప్రకాశం జిల్లా పామూరులో 44.8°C, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 44.6°C, కృష్ణా జిల్లా కోడూరులో 44.5°C, నెల్లూరు జిల్లా మనుబోలులో 44.4°C, అల్లూరి జిల్లా కూనవరంలో 44.3°C, గుంటూరు జిల్లా తుళ్లూరులో 44.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.