Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave alert: రేపు వడగాలులు వీచే మండలాలు ఇవే

Heat wave alert: రేపు వడగాలులు వీచే మండలాలు ఇవే

ఐఎండి అంచనాల ప్రకారం గురువారం 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసెజ్లు పంపిస్తోంది ఐఎండీ. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉంది.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(125) :-
అల్లూరి జిల్లా 7,
అనకాపల్లి 15,
తూర్పుగోదావరి 4,
ఏలూరు 2,
గుంటూరు 11,
కాకినాడ 10,
కృష్ణా 4,
ఎన్టీఆర్ 12,
పల్నాడు 5,
పార్వతీపురంమన్యం 11,
శ్రీకాకుళం 13,
విశాఖపట్నం 2,
విజయనగరం 23,
వైఎస్ఆర్ జిల్లాలో 6 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

బుధవారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 93 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News