రాష్ట్రంలో రేపు 23 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గుంటూరు 4, ఎన్టీఆర్ 7, పల్నాడు 4, వైఎస్సార్ జిల్లాలోని 8 మండలాలు, వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 46.2°C, వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 45.2°C, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 44.9°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవని, 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 25 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు బయటకు రాకుండా ఉండలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్నిచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడరాదని తెలిపారు.
Heat wave: రేపు 23 మండలాల్లో వడగాల్పులు
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES