Heat Wave in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతకు తాళలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ఇక, కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీలు చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మరోవైపు, 13 జిల్లాలోని 95 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకి రావొద్దని హెచ్చరించారు. ఇక, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై గత రికార్డులను బద్దలు కొట్టింది.
Also read: Telangana Cabinet: గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్లు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

