రేపు పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ, పార్వతీపురం మండలాల్లో, వైయస్సార్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, వీరపనాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలాల్లో, విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి
ఆదివారం వైయస్సార్ జిల్లాలో ఆరు మండలాలు, నంద్యాల జిల్లాలో 1 మండలంలో వడగల్పులు వీచాయి.
నంద్యాల జిల్లా చాగలమర్రిలో 43.8°C, నెల్లూరు జిల్లా సీతారామపురంలో 43.5°C, వైయస్సార్ జిల్లా చక్రాయపేటలో 43.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.
-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
*
మరోవైపు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుంది.
దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, వైఎస్ఆర్, సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
ఎల్లుండి అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
మన్యం,విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ, కృష్ణా, వైఎస్ఆర్, సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- డా. బిఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.