రాష్ట్రంలో మరో రెండు రోజులు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 50 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 100 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 119 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
శనివారం విజయనగరం జిల్లా అక్కివరంలో 44.8°C, విశాఖ జిల్లా పద్మనాభం, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44.7°C, నెల్లూరు జిల్లా ఉదయగిరి, శ్రీకాకుళం జిల్లా పలాసలో 45.6°C, అనకాపల్లిలో 44.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 60 మండలాల్లో తీవ్రవడగాల్పులు,116 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.