రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 134 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 129 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,248 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఆదివారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి, కాకినాడ జిల్లా కరప, విజయనగరం జిల్లా జామిలో 44.8°C, విశాఖ జిల్లా పద్మనాభంలో 44.7°C, మన్యం జిల్లా భామిని, కోనసీమ జిల్లా శివలలో 44.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 86 మండలాల్లో తీవ్రవడగాల్పులు,110 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపుఅక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.