Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Weather : వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు

AP Weather : వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. ఆదివారం రాత్రికి చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంద్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

ఆ తర్వాత క్రమంగా బలహీన పడి.. చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటనుందని పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, శ్రీహరికోట, మహాబలిపురం, తిరుపతి జిల్లాల్లో.. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే.. దక్షిణ కోస్తా, తమిళనాడు తీరం వెంబడి 45-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News