Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Cyclone: బలహీన పడ్డ తీవ్ర వాయుగుండం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు!

Cyclone: బలహీన పడ్డ తీవ్ర వాయుగుండం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు!

Weather Forecast Update: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా ప్రాంతంలో వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది ఒడిశాలో దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌ వరకు పయనించి మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.

- Advertisement -

మూడు రోజులు భారీ వర్షాలు: మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లా లో కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు అవకాశం ఉందని అన్నారు. 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టం గా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. టెక్కలి, మందస 17 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/wind-gusts-over-the-bay-of-bengal-coast/

సిక్కోలులో భారీ వర్షాలు: తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కేరాసింగ్‌లో రోడ్డుపై కొండచరియుల విరిగిపడ్డాయి. వరద ఉధృతికి రహదారి భారీగా కోతకు గురై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురైయ్యారు. అదేవిధంగా ఆముదాలవలస, సిరుబుజ్జిలి మండలాల్లో భారీ వర్షం కురిశాయి. ఎల్‌ఎన్‌పేట, బూర్గ, జలుమూరు మండలాల్లో సైతం భారీ వర్షాలు కురవడంతో తీవ్ర పంట నష్టం జరిగిందని రైతులు వాపోయారు.

పలుచోట్ల భారీ వర్షాలు: తీవ్ర వాయుగుండం ప్రభావంతో పార్వతీపురం నాగావళి నదికి వరద ఉధృతి పోటెత్తింది. దీంతో బాసింగి గ్రామం పూర్తిగా వరద ముంపునకు గురైంది. ముంపుప్రాంతంలోని సంగమేశ్వరస్వామి ఆలయం పూర్తిగా నీట మునిగింది. మరొకవైపు అల్లూరి జిల్లాలో సైతం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో చింతూరు, వీఆర్‌పురం మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అదే విధంగా సోకిలేరు ఉధృతంగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad