Heavy Rainfall Expected in AP in Coming days: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దండయాత్ర చేయనున్నాయి. తీవ్ర అల్పపీడనం బలపడి తిరిగి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. గుజరాత్ విదర్భ, దక్షిణ ఛత్తీస్గడ్ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా పశ్చిమ బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. రేపు (మంగళవారం) ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెఅధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
రాబోయే రెండు మూడ్రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా, ఆంధ్ర ప్రదేశ్
ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో సంభవించే అవకాశముంది. ఇక, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమ జిల్లాలు
ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (బుధవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.


