Saturday, November 15, 2025
HomeTop StoriesMontha Cyclone: పెను ఉప్పెనలా దూసుకొస్తోన్న మొంథా.. 17 జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌!

Montha Cyclone: పెను ఉప్పెనలా దూసుకొస్తోన్న మొంథా.. 17 జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌!

Cyclone Montha Effect on AP: మొంథా తుపాను రాష్ట్రంపై విరుచుకుపడేందుకు పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. బలమైన ఈదురు గాలులు తీరప్రాంతాలను కకావికలం చేస్తున్నాయి. జడివానలతో ఒక్కసారిగా విరుచుపడేందుకు మొంథా ఉగ్రరూపం దాల్చేందుకు.. సాగర తీరన ఉరకలేస్తుంది. దీంతో రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పాటు జల రవాణా సైతం పూర్తిగా స్తంభించింది.

- Advertisement -

తుపాను గమనం: ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో కాకినాడ తీరం వైపు దూసుకువస్తుంది. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ, అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దైంది. బలమైన ఈదురు గాలుల వలన.. కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి ఇది తుపానుగా మారింది.

నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు: తుపాను ప్రభావంతో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/montha-cyclone-live-updates-severe-cyclone-and-heavy-rains-1996-konseema-cyclone/

స్తంభించిన రవాణా వ్యవస్థ: పెను తుపాను కారణంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను ఇప్పటికే రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో ఏకంగా 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో జల రవాణా సైతం నిలిచిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. అంతేకాకుండా నౌకాదళానికి చెందిన పలు నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి.

17 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌: పెను ఉప్పెనలా దూసుకొస్తోన్న మొంథా కారణంగా.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించింది. మంగళ, బుధవారం అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో.. 17 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టా­­లంటూ కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని ..కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad