Thursday, November 14, 2024
Homeఆంధ్రప్రదేశ్Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Rains| ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా రూపాంతరం చెందడంతో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉభయగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కృష్ణ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని తెలిపింది.

- Advertisement -

అలాగే కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. నది, రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారలు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News