Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో బయట క్యూలైన్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 67,785 మంది భక్తులు దర్శించుకోగా.. వీరిలతో 27,753 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.38 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

ఇక నవంబర్ నెలకు సంబంధించి పర్వదినాలను టీటీడీ(TTD) ప్రకటించింది. నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 9న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర, 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, నవంబరు 12న ప్రబోధన ఏకాదశి, నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, నవంబరు 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి పర్వదినాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు

ఇదిలా ఉంటే టీటీడీ నూతన చైర్మన్‌గా ఎంపికైన బీఆర్ నాయుడు(BR Naidu) ఈ నెల 6న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పాలకమండలి సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే తాజాగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని పాలకమండలిలో సభ్యుడి చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఎక్స్ అఫిషియో మెంబ‌ర్లుగా టీటీడీ ఈవో, ఎండోమెంట్ కార్య‌ద‌ర్శి, ఎండోమెంట్‌ కమిషనర్, తుడా చైర్మన్‌ల‌కు అవ‌కాశం కల్పించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News