Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో భక్తులు కొండకు తరలివస్తున్నారు. శుక్రవారం 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉంటే.. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 16 గంటల సమయం పడుతోండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది.
- Advertisement -
శుక్రవారం 63,731 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 22,890 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.