HomeTop StoriesTTD Darshan: వేసవి సెలవులతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

TTD Darshan: వేసవి సెలవులతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Heavy rush in TTD due to holidays: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. గ‌త ఐదు రోజుల్లోనే ఏకంగా 4,32,213 మంది భ‌క్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధికంగా మే 16, 17 తేదీల్లో 90 వేల‌ మందికి పైగా భ‌క్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

Also Read: Ram Charan: పొలిటికల్‌ ఎంట్రీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

కూల్‌ పెయింటింగ్‌.. చలువ పందిళ్లు.

తిరుమలలోని బాటగంగమ్మ సర్కిల్‌ నుంచి గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ మీదుగా ఔటర్‌ రింగు రోడ్డు వరకు టీటీడీ చలువ పందిళ్లు ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లను నిర్మించింది. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ వేయడంతో పాటు తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేసింది. ఇదే సమయంలో నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు.

Also Read: Sara Tendulkar: బాడీ షేమింగ్‌ పోస్ట్‌.. నెటిజన్‌కు సారా టెండూల్కర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

క్యూలైన్లలో తాగునీరు, భోజన వసతి..

టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకుల ద్వారా క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారంగా పాలు, ఉప్మా, పొంగల్‌.. మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమాటా రైస్‌ అందజేస్తున్నారు. రాత్రి సమయంలో భక్తులకు పాలు, సాంబారన్నం పంపిణీ చేస్తున్నారు. ర‌ద్దీకి అనుగుణంగా ఔట‌ర్ రింగ్ రోడ్డులో క్యూలైన్ల వెంబ‌డి మొబైల్ ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్‌ను అందుబాటులో ఉంచారు. గత ఐదురోజుల్లో త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే భ‌క్తుల సంఖ్య కూడా విప‌రీతంగా పెరిగింది. అత్యధికంగా మే 18, 19, 20 తేదీల్లో 43 వేల‌కు పైగా భ‌క్తులు స్వామివారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. మరోవైపు, తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 19 లక్షలకు పైగా భ‌క్తుల‌కు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మ‌జ్జిగ అందించారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది దర్శన క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News