గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలోని పేద మహిళల జీవితాలలో నిలకడ కలిగిన అభివృద్ధి చూసేందుకు వై.యస్.ఆర్ చేయూత, వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకు వెళ్తామని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అభివృద్ధి అధికారి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ పరిపాలనా విధానము మరింత పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా నడిపేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నట్టు ఆయన వెల్లడించటం విశేషం.
ఇందులో భాగంగా ఈరోజు Heifer International తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. Heifer International, India గ్రామీణ ప్రాంతాలలోని పేద మహిళలు వ్యవసాయ ఆధారిత వృత్తులలో ఆధారపడిన వారికి సహాయ సహకారాలు అందించి ఆర్ధికంగా వారు నిలదొక్కుకునేటట్లు చేస్తుందన్నారు. పాడి పశువులు, కోళ్ళ పెంపకం, చిన్న జీవాలు పెంపకం దారులకు శిక్షణ,మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమములో Heifer International ప్రతినిధులు Smt.Surita Sandosham, Sri.Terry Wyer, Smt.Elia Maker, Sri.Mahendra Lohani, Smt.Rina Soni, Sri.Pranjit Talukdar,Sri.Shyam Kumar Katta మరియు SERP డైరెక్టర్ శ్రీమతి. విజయకుమారి , అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి.మహిత , DGM M. కేశవ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు .