Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Rushikonda: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ‘రుషికొండ’ కమిటీపై కీలక ఆదేశాలు

Rushikonda: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ‘రుషికొండ’ కమిటీపై కీలక ఆదేశాలు

Rushikonda: విశాఖపట్నం రుషికొండ తవ్వకాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రుషికొండపై తవ్వకాలు, నిర్మాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు ఏర్పాటయ్యే కమిటీలో ఉన్న ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికారులను తొలగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన కమిటీలో ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికారులు, ఇద్దరు మాత్రమే కేంద్ర స్థాయి అధికారులు ఉన్నారు. దీనిపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

- Advertisement -

కొత్త కమిటీలో ఐదుగురు సభ్యులు కేంద్రస్థాయి అధికారులే ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. రుషికొండను తవ్వి అక్కడ కొన్ని కొత్త నిర్మాణాలు చేపడుతోంది ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అయితే నిబంధనలకు విరుద్ధంగా రుషికొండలో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విశాఖపట్నం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేనకు చెందిన మూర్తి యాదవ్ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే, ఈ కమిటీలో ముగ్గురు ఏపీ అధికారులు ఉన్నారు. దీంతో వీరిని తొలగించాలని, ఐదుగురూ కేంద్ర స్థాయి సభ్యుల్నే నియమించాలని తాజాగా ఆదేశించింది. కమిటీ సభ్యుల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిటీ తన నివేదికను జనవరి 31 లోపు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News