Sunday, April 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Holagonda: వైభవంగా బసవేశ్వర జయంతి

Holagonda: వైభవంగా బసవేశ్వర జయంతి

సకల జనుల సమభావనను లోకానికి అందించిన మహా అద్భుత పండితుడు ఆ బసవేశ్వరుడి జయంతి సందర్భంగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త రాజపంపన గౌడ్, శివ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో బసవేశ్వరుని జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 50 జతల ఎద్దులు, బసవేశ్వరుని చిత్రపటం, డొల్లు వాయిద్యాలతో సిద్దేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి కోటవీధి, ఈర్ల కట్ట, బస్టాండ్ మీదుగా ఊరేగింపు శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. ఈ జయంతి ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన భక్తులకు శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News