శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి ఉత్సవాలు హొళగుంద, పెద్దహ్యట, వందవాగిలి, కొగిలతోట, ముద్దటమాగి, ఎల్లార్తి, నేరణికి, బొంబగుండనహళ్లి, గేజ్జెహళ్లి తదితర గ్రామాలలో అంగరంగ వైభవంగా జరిగాయి.హొళగుంద, వందవాగిలిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ మొలగవల్లి శశికళ కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ముందుగా శశికళ కృష్ణమోహన్ కనకదాసు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మొలగవల్లి శశికళ కృష్ణమోహన్ మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు కురువ కులస్తులకు ఆరాధ్య దైవం అని అన్నారు. కర్ణాటక ప్రాంతంలో భక్త కనకదాసు ఎన్నో రచనలు చేశారని అతను ఓ గొప్ప కవి అని ఆయన అడుగుజాడల్లోనే మనమందరం నడవాలని అన్నారు. అనంతరం శ్రీ భక్త కనకదాసు చిత్రపటాన్ని డోళ్లు,వాయిద్యాలు, కోలంటాలతో ఈర్లకట్ట దగ్గర నుండి బస్టాండ్ మీదుగా భక్త కనకదాసు ఆలయ ప్రాంగణం వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఊరేగింపులో మొలగవల్లి శశికళ కృష్ణమోహన్ వారి ఆచార సంప్రదాయాల ప్రకారం డోళ్లు కొట్టే సన్నివేశం ప్రజలను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ వింగ్ అండ్ జోనల్ కర్నూలు మరియు నంద్యాల అధ్యక్షుడు చిప్పగిరి జెడ్పిటిసి విరుపాక్షి, మదాసి మదారి కురువ జిల్లా ప్రధాన కార్యదర్శి డి గర్జప్ప, మదాసి మదారి కురువ తాలూకా ప్రధాన కార్యదర్శి కురువ మల్లయ్య, మదాసి మదారి కురువ మండల అధ్యక్షులు పంపాపతి,మదాసి మదారి మండల ఉపాధ్యక్షులు చిన్నహ్యట బసవరాజ్, మంజునాథ్ గౌడ్, కురువ గాజులింగా, పెద్దహ్యట బసవ, కురవ కుల బాంధవులు, మదాసి మదారి కురువ సంఘం నాయకులు, కనక శ్రీ యూత్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
మన ధర్మానికి,సంస్కృతికి ప్రత్యేకతలే దేవాలయాలు
హొళగుంద మండల కేంద్రంలోని ఆదిపరాశక్తి గాయత్రి దేవి (మహంకాళమ్మ) ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం చేయాలంటూ పంచాయతీరాజ్ వింగ్ అండ్ జోనల్ కర్నూలు-నంద్యాల జిల్లా అధ్యక్షులు చిప్పగిరి జడ్పిటిసి విరపాక్షి కి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన విషయం మేరకు గురువారం నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి తన వంతుగా రూ.50వేల విరాళంగా ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలు మన ధర్మానికి, సంస్కృతికి ప్రత్యేకతలు అన్నారు.వాటి ఆధారంగా మన ఆచారాలు,సాంప్రదాయ పరంపరను కొనసాగించాలని అన్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అనంతరం శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ కుడ్లూరు ఈరప్ప, జంబయ్య, సిద్ధప్ప, వైసీపీ కృష్ణయ్య, వీరేష్, బోయ గుర్నూలు మల్లికార్జున, పులి ఎర్రిస్వామి, ఈరన్న, రాఘవేంద్ర, ఆఫీజ్, ఈమానుల్లా, రఫిక్, అమీర్, గ్రామప్రజలు పాల్గొన్నారు.