కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలోని శ్రీ వీరుపాక్ష దేవాలయంలో ఆదివారం వైభవంగా సామూహిక వివాహాలు జరిగాయి. బళ్లారి ఆనంద్ గౌడ్ కుటుంబ సభ్యులు ఈ వివాహ కార్యక్రమాలను దగ్గరుండి జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిరుపేద కుటుంబాలకు చెందిన వధూవరులకు ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నాట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఒకే వేదికపై తొమ్మిది జంటలకు వివాహం జరిగిందన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆనంద్ గౌడ్ కుటుంబ సభ్యులకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Holagunda: వైభవంగా సామూహిక వివాహాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES